రిషబ్ శెట్టి - రష్మిక మందన్న వివాదం అంతకంతకూ ముదురుతోంది. కాంతారా సినిమాపై స్టార్ హీరోయిన్ చేసిన వాఖ్యలు.. ఆమె గురించి రిషబ్ శెట్టి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కన్నడ ఇండస్ట్రీలో రుషబ్ శెట్టి - రష్మిక వివాదం ముదిరి పాకానపడుతోంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇప్పటికీ జోరు కొనసాగిస్తోంది. నటుడు, రచయిత మరియు దర్శకుడు రిషబ్ శెట్టి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా రష్మిక మందన్నపై అతను చేసిన కామెంట్స్ హైలెట్స్ అవుతున్నాయి.
ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిషబ్ శెట్టి రష్మిక మందన్నతో కలిసి పనిచేయడానికి ఆసక్తి లేదని డైరెక్ట్ గా చెప్పేశాడు. మీరు ఏ నటితో కలిసి పని చేయాలనుకుంటున్నారని యాంకర్ అడగడంతో పాటు అతనికి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. రష్మిక మందన్న తో పాటు కీర్తి సురేష్, సాయి పల్లవి మరియు సమంత పేర్లు సూచించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2016లో విడుదలైన రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీతో పెద్ద తెరపైకి అడుగుపెట్టింది రష్మిక మందన్న. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమంటూనే వచ్చాయి. రిషబ్ తమ్ముడు రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ అయిన తరువాత అతన్ని కాదనుకొని వెళ్ళిపోయినందుకు ఆమెపై అంతా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కొందరి మాట మాత్రమే.
అయితే ఇప్పుడు మరోసారి వీరి మధ్య గొడవ స్టార్ట్ అయినట్ట్టు తెలుస్తోంది. ఇది రిషబ్ మాటలోనే తెలుస్తోంది. కన్నడ లో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాను చూశారా అని విలేకరులు అడగ్గా.. తాను ఇంకా చూడలేదని, సమయం కుదరలేదని చెప్పి అగ్గి రాజేసింది నేషనల్ క్రష్.ఇక దీంతో రష్మికపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే రష్మిక కామెంట్లకు కౌంటర్ గానే రిషబ్ ఈ ఇంటర్వ్యూలో ఆ కామెంట్స్ చేశాడంటున్నారు సినీ జనాలు.
ఇంటర్వ్యూలో సాయి పల్లవి రష్మిక మందన్న ,సమంత, కీర్తి లలో మీరు ఎవరితో నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ మాట్లాడుతూ సాయి పల్లవి మంచి యాక్టర్, సమంత తో నటించాలని ఉంది. ఇక కొత్త హీరోయిన్లతో చేయడానికి ఇష్టపడతాను అని రష్మిక పేరును వదిలేస్తూ ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్ ను చూపించి కౌంటర్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కన్నడ నాట చిన్న హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన్న ఛాలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది... గీతా గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.
