టాలీవుడ్ రష్మిక మందన ప్రస్తుతం యువతలో మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. ఆమె క్యూట్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. సరిలేరు వీకెవ్వరు చిత్రంలో రష్మిక మహేష్ బాబుతో ఆడిపాడనుంది. ఈ చిత్రంలోప్ రష్మిక తన రెమ్యునరేషన్ హైక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

తన సొంత చిత్ర పరిశ్రమ కన్నడలో కూడా రేష్మిక పారితోషికం పెంచేసింది. రష్మిక నిర్ణయాన్ని అక్కడివారు కొందరు తప్పుబడుతున్నారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించింది. నటీనటులంతా కెరీర్ లో ఏదో ఒక సమయంలో ఎదుగుదల కోరుకుంటారు. నేను కూడా అదే చేస్తున్నా. అందులో తప్పేముంది అని తన నిర్ణయాన్ని రష్మిక సమర్థించుకుంది. 

గీతా గోవిందం, చలో చిత్రాల విజయాలతో రష్మిక యువతకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం మహేష్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్, నితిన్ నటిస్తున్న భీష్మ చిత్రాల్లో రష్మిక నటిస్తోంది.