గీతగోవిందం సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకున్న రష్మిక మందన్న చాలా స్పీడ్ గా స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుంటోంది. ఛలో సినిమా నుంచి  మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ వరకు చూసుకుంటే బేబీ గ్లామర్ డోస్ పెంచకుండా బాగానే జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు గ్లామర్ తో మెల్లగా హీటెక్కించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

రష్మిక ఇన్స్టాగ్రామ్ లో అప్పుడపుడు గ్లామర్ తో కుర్రకారుకు వల వేస్తుంటుంది. ఇక ఈ మధ్య బేబీ గ్లామర్ షో డోస్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంటె చూపులతోనే కాకుండా అందాలను సరికొత్తగా వడ్డించేస్తోంది. దీంతో నిమిషాల్లో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా చిట్టిపొట్టి డ్రెస్సుల్లో మేడమ్ గారు కనిపించిన తీరు మాములుగాలేదు. 

రష్మిక చాలా అందంగా ఉందని పాజిటివ్ కామెంట్స్ వస్తునప్పటికీ చాలా మందిలో ఇంకా ఈ డోస్ ఎంతవరకు పెరుగుతుందో అనే భావన కూడా కలుగుతోంది.  ఇకపోతే బేబీ ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.