కన్నడ చిత్రం కిరాక్ పార్టీతో వెండితెరకు పరిచయమైన రష్మిక, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కిరాక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడిన రష్మిక అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. రక్షిత్ శెట్టి, రష్మిక మందాన నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. నిశ్చితార్థం తరువాత వీళ్లిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. రష్మిక, రక్షిత్ పెళ్లి చేసుకోకుండానే బ్రేకప్ అయ్యారు. ఈ విషయంపై రష్మిక ఎప్పుడూ స్పందించలేదు. అయితే రక్షిత్ మాత్రం కొన్ని సార్లు రష్మికతో బ్రేకప్ గురించి కామెంట్స్ చేశారు. నిశ్చితార్థం తరువాత రష్మిక ఆశలు పెరిగిపోయాయని, ఆఫర్స్ వస్తూ ఉండడంతో నన్ను వదిలేసింది అన్నాడు. 

చాలా కాలం ఎడమొహం పెడమొహంగా ఉన్న రష్మిక, రక్షిత్ ఈ మధ్య దగ్గరవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. సడన్ గా వీరిలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రష్మిక, రక్షిత్ మరలా ప్రేమికులుగా మారాలనుకుంటున్నారా? లేక మంచి ఫ్రెండ్స్ గా కొనసాగాలనుకుంటున్నారా? అని శాండిల్ వుడ్ మీడియా వరుస కథనాలు రాస్తుంది. 

మరోవైపు రష్మిక కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అరడజనుకు పైగా సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో అల్లు అర్జున్ కి జంటగా నటిస్తుంది. అలాగే రెండు హిందీ చిత్రాలకు రష్మిక సైన్ చేశారు. సౌత్ తో పాటు హిందీలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ  తనకు తిరుగులేదని నిరూపిస్తుంది. మరి హిందీలో కూడా సక్సెస్ అయితే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకునే అవకాశం కలదు.