ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమై, గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. డీగ్లామరస్ పాత్ర, ట్రెడిషనల్ పాత్ర ఏదైనా న్యాచురల్  నటన కనబరచి దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలలో రష్మిక కంటే ఆమె పాత్ర ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే తెలుగులో అతి తక్కువ కాలంలో  క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ ప్రక్కన సినిమా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు తమిళంలో విజయ్ సరసన నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె ఎంత రెమ్యునేషన్ తీసుకుంటోంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె కోటి రూపాయలు దాకా ఛార్జ్ చేస్తోంది.  

రష్మిక మాట్లాడుతూ... ''మొదటి సినిమా చేసే వరకు కూడా నాకు నటనలో అసలు ఓనమాలు కూడా రావు. పాఠశాలలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా డ్యాన్సులు చేసేదాన్ని కానీ నటనవైపు అస్సలు వెళ్లేదాన్ని కాదు.ఒకే ఒకసారి మాత్రం ప్రయత్నించినా నటించలేకపోయా. ఇక అప్పటి నుండి నటన జోలికి వెళ్లలేదు. అయితే అలా నాకు అప్పట్లో నటన తెలియకపోవడమే ఇప్పుడు నాకు ప్లస్ అయిందేమో అని చెప్పుకొచ్చింది. 

అలాగే మొదటి సినిమా కోసం కెమెరా ముందు నిలబడినప్పుడు నాలా నేను కనిపించాలనుకున్నా. ఆర్టిఫిషియల్ నటన కనబరుస్తూ ప్రత్యేకంగా హావభావాలు పలికించకుండా సన్నివేశంలోని సందర్భం నిజంగా నాకే ఎదురైతే ఎలా స్పందిస్తానో ఊహించుకుంటూ అందుకు తగ్గట్టుగా నటించాను.అలా చేయడం వలనే నాలో ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. నా పాత్రల్లో కనిపించే సహజత్వం వెనుక అసలు రహస్యం అదే'' అని చెప్పింది రష్మిక.