బుల్లితెర యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న రష్మి టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె షూటింగ్ కోసం స్టూడియోకి వెళ్లగా.. అక్కడ బయట ఒక కుక్కపిల్లని చూసిందట.

దానికి వైద్యం కావాలని, ఎవరూ పట్టించుకోకపోవడం బాధగా ఉందంటూ ట్వీట్ పెట్టింది. ఆ కుక్కపిల్ల ఫోటోలను షేర్ చేస్తూ.. ''ఈ పప్పీకి వైద్యసాయం కావాలి. నేను షూటింగ్ చేస్తున్న స్టూడియో బయట దీనిని నేను చూశాను. జంతువుల పట్ల మనుషులు చూపిస్తున్న నిరాదారణ నన్ను కలచివేసింది. దయచేసి సాయం చేయండి'' అంటూ పోస్ట్ పెట్టింది.
మరికాసేపటికి ఆ పప్పీని తాను హాస్పిటల్ కి తీసుకెళుతున్నట్లు చెప్పింది. దానికి తీవ్ర గాయాలైనట్లు కనిపిస్తోందని.. వైద్యంతో అది కోలుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పింది. దయచేసి రెస్క్యూ హోం నంబర్స్ ఉంటే తెలియబరచాలని ఫ్యాన్స్ ని కోరింది.
Scroll to load tweet…
Scroll to load tweet…