రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తూ ఎంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రష్మీ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో రష్మీ సినీ అవకాశాలు కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే.

రష్మీ గౌతమ్ జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తూ ఎంతో గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రష్మీ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో రష్మీ సినీ అవకాశాలు కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కమెడియన్లతో కలసి ఆమె కూడా వినోదం అందిస్తూ ఉంటుంది. 

స్కిట్ మధ్యలో రష్మీ వేసే సెటైర్లు లేదా ఆమెపై కమెడియన్లు వేసే సెటైర్లు బాగా పేలుతుంటాయి. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కమెడియన్ ఇమ్మాన్యూల్, రష్మీ మధ్య జరిగిన సంభాషణ చాలా బోల్డ్ గా ఫన్నీగా ఉంది. 

ఈ ప్రోమోలో ఇమ్మాన్యూల్, బులెట్ భాస్కర్, వర్ష, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను పెర్ఫామ్ చేసిన స్కిట్ లు చూపించారు. ప్రోమోలో చూపించిన ఫన్నీ బిట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. బులెట్ భాస్కర్ ఇంద్ర చిత్రంలోని సన్నివేశాన్ని పేరడీ చేశారు. సినిమా పూర్తయింది.. 200 కోట్లు గ్యారెంటీ అని బుల్లెట్ భాస్కర్ అంటాడు. దుబాయ్ లో ఉంటది ఏంటది అని భాస్కర్.. ఇమ్మాన్యూల్ ని అడగగా.. బుర్జ్ ఖలీఫా అని సమాధానం ఇస్తాడు. 

వెంటనే వర్షని చూపించి అదేంటి అని అడుగుతాడు.. దీనితో ఇమ్మాన్యూల్.. మియా ఖలీఫా అని బదులిస్తాడు. వెంటనే రష్మీ అందుకుని వీడియోలు బాగానే చూస్తున్నావుగా అని అడుగుతుంది.. దీనికి ఇమ్మాన్యూల్ ఇచ్చే సమాధానం దిమ్మతిరిగేలా ఉంది అనే చెప్పాలి. ఏమ్మాట్లాడుతున్నావ్.. నేను ఆమెకి సబ్ స్క్రైబర్ ని అని అంటాడు. మరి ఇమ్మాన్యూల్.. వర్షని ఏకంగా పోర్న్ స్టార్ తో పోల్చడం షాకింగ్ గా మారింది. 

ఇదే ప్రోమోలో ఆటో రాంప్రసాద్, గెటప్ శీను కలసి చేసిన ట్రైన్ స్కిట్ ని కూడా చూపించారు. రాంప్రసాద్ మార్క్ ఆటో పంచ్ లతో ఈ స్కిట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. కంప్లీట్ ఎపిసోడ్ మార్చి 3న ప్రసారం కానుంది.