ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బాటిల్ క్యాప్ ఛాలెంజ్' అనేది బాగా వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ పై యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఛాలెంజ్ పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని నిజంగానే సీరియస్ గా తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించింది.

అసలు ఇలాంటివి చేసేవాళ్లకు పనీపాటా లేదని చెప్పింది. ఇలాంటి వాటిపై శ్రద్ధ పెట్టేకంటే పనికొచ్చే విషయాలపై పెడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేవారు సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని.. అలాంటి వాళ్లు సెలబ్రిటీలు చేసే మంచి పనులకు కూడా చూడాలని.. అభిమానులు అని చెప్పుకుంటున్న వారు సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అందరిలానే తనకు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని.. ఈ విషయంలో ఎవరేమనుకున్నా.. తనకు పోయేదేమీ లేదని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా.. సెలబ్రిటీలు సైతం ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యానంటూ వీడియో పోస్ట్ చేశారు. ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.