Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ రేటుకు రామ్,లింగుస్వామి చిత్రం ఆడియో రైట్స్

 ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని రేటుకు అమ్ముడవటంపై సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

RAPO19 Aditya Music shelled out a whopping Rs 2.75 crore
Author
Hyderabad, First Published Aug 3, 2021, 7:52 AM IST

ఇస్మార్ట్ శంకర్ తో ఉస్తాద్ గా మారిపోయిన ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ ముందు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసారు. అప్పుడు పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసి మొదలెడదామనుకునేలోగా సెకండ్ వేవ్ తో షూట్ వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు పనులు అన్ని స్పీడు అవుతున్నాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్ని సినిమాలు మళ్ళీ పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్ – లింగుస్వామి కూడా యాక్షన్ మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని రేటుకు అమ్ముడవటంపై సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అందుతోన్న సమాచారం మేరకు...ఆదిత్య మ్యూజిక్ వారు ఈ చిత్రం ఆడియో రైట్స్ తీసుకున్నారు. 2.75 కోట్లు ఈ సినిమా ఆడియో రైట్స్ కోసం చెల్లించారు. ఓ మిడ్ రేంజ్ హీరో సినిమాకు ఈ రేటు రావటం అనేది చాలా గొప్ప విషయం. రికార్డ్ అని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. లింగుస్వామి స్టైలిష్ మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట కాగా.. రామ్ నుండి కూడా అభిమానులు అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీని ఆకర్షిస్తుంది.

అలాగే రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ సరసన మరో టాలెంటెడ్ కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్తోంది. అక్షర నటిస్తోందని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. అక్షర గౌడ్ ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొంటోంది. అయితే, ఈ సినిమాలో విలన్ గా నటిస్తోన్న హీరో ఆది సరసనే అక్షర గౌడ నటిస్తుందని వినపడుతోంది. అక్షర పాత్ర చాల పవర్ ఫుల్ గా .. పల్నాటి నాగమ్మ పాత్రను పోలి ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమా కోసం బోల్డ్ గా కనిపించనుందని ఇప్పటికే సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. 

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఎనర్జీని మరో స్థాయిలో ప్రెజెంట్ చేస్తూ...ఓ మాస్ కథను సిద్ధం చేసిన లింగుస్వామి.. అతన్ని ఓ  డిఫరెంట్ షేడ్‌లో చూపిస్తున్నారట.

Follow Us:
Download App:
  • android
  • ios