చూసారా?: బన్నీ ‘ర్యాప్ సాంగ్’ దుమ్ము రేపుతోంది!
గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
‘తెలుగోడి స్టైల్..మనమేలే బ్రాండ్’ అంటూ సాగే ఈ ర్యాప్‌సాంగ్‌ను తెలుగు ర్యాప్ సింగర్ రోల్‌రైడా రచించి, ఆలపించగా సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేశారు. బన్నీ మొదటి చిత్రం ‘గంగోత్రి’నుంచి ఇటీవల వచ్చిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం వరకు ఆయన పోషించిన పాత్రలు, పేల్చిన డైలాగులతో ఈ పాటను మలిచారు. మంచి బీట్‌తో సాగుతున్న బన్నీ ‘ర్యాప్ సాంగ్’ను మీరు చూసి ఎంజాయ్ చేయండి!
గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు తమన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.తాను వన్ బిలియన్ ఆల్బమ్ అడిగితే.. తమన్ టు బిలియన్ల కంటే ఎక్కువ అల్బమ్ ఇచ్చాడంటూ పొగడ్తలతో ముంచేశాడు.
ఇక తమన్ కూడా స్టైలిష్‌స్టార్‌పై ఉన్న ప్రేమను పాట రూపంలో చూపించాడు. జర్నీ ఆఫ్ అల్లు అర్జున్ పేరుతో ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి మొదలు.. అల వైకుంఠపురములో వరకు అన్ని మూవీలను, అందులోని బన్నీ పాత్రలను గుర్తు చేస్తూ పాడిన ఈ ర్యాప్ సాంగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటను బన్నీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తమన్‌కు థాంక్యూ చెప్పారు.