ఈ ఏడాది మొదట్లోనే అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌ల ను తిరగ రాసింది. నాన్‌ బాహుబలి రికార్డు లన్నింటినీ చెరిపేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను రీమేక్‌ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఇంట్రస్ట్ చూపించారు. ఒక దశలో బాలీవుడ్‌ రీమేక్‌కు హీరో కూడా ఓకే అయినట్టుగా వార్తలు వినిపించాయి. బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్‌ సింగ్ అల వైకుంఠపురములో రీమేక్‌లో నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈ మూవీపై రణవీర్ టీం క్లారిటీ ఇచ్చింది. రణవీర్‌ సింగ్ అల వైకుంఠపురములో రీమేక్‌కు అంగీకరించలేదని. అలాంటి ప్రపోజల్‌ ఏది అసలు రణవీర్‌ దగ్గరకు రాలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రణవీర్ ఇప్పటికే చేతినిండా సినిమాలతో  బిజీగా ఉడటంతో కొత్త సినిమాలను అంగీకరించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు రణవీర్ టీం.
83 Update: Ranveer Singh & Team To Bond Over 15 Days Intense ...

ఈ యంగ్ హీరో ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 83తో పాటు కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న పీరియడ్‌ డ్రామా తక్త్‌ తో పాటు జయేష్ బాయ్‌ జోర్దార్‌ లాంటి వరుస సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు దీంతో సౌత్‌ రీమేక్‌ను అంగీకరించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు రణవీర్ టీం. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్గే హీరోయిన్‌గా నటించిన అల వైకుంఠపురములో సినిమాకు తమన్‌ సంగీతమందించాడు. ఈ సినిమా మ్యూజిక్‌ ఇప్పటికీ రికార్డ్‌ లు తిరగరాస్తున్న సంగతి తెలిసిందే.