బాలీవుడ్ లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో రణ్ వీర్ సింగ్ కు ఆలియా భట్ కు ఓ అభిమానికి మధ్య సరదా సన్నివేశం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
పెళ్ళి పిల్లలు తరువాత ఆలియా భట్ నటిస్తున్న సినిమా రాఖీ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ.రణ్‌వీర్ సింగ్ , ఆలియా భట్ జంటగా నటిస్తున్నఈ లేటెస్ట్ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. లవ్ అండు ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈసినిమా కరణ్ జోహార్ మార్క్ తో రూపొందింది. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. దాంతో ప్రస్తుతం ఈమూవీ ప్రమోషన్లు సూపర్ ఫాస్ట్ గా కొనసాగిస్తున్నారు టీమ్. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ ఆన్-స్క్రీన్ జంట ఢిల్లీలోని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఆలియాకు ఓ అభిమాని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీలో సందడి చేశారు. దేశ రాజధానిలోని ఓ వీధిలో జరిగిన ఈవెంట్‌లో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంట అభిమానులను పలకరిస్తుండగా.. ఓ అభిమాని సడన్‌గా వచ్చి ఆలియాకు ఝుమ్‌కాస్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అటు హీరో రణ్ వీర్ సింగ్ ఈ సీన్ చూసి.. సరదాగా స్పందించారు. తనదైన శైలిలో ఆభిమానితో మాట్లాడిన రణ్ వీర్ సింగ్.. తిరిగి ఏమి కావాలని అడిగాడు. దీంతో ఆ ఫ్యాన్ స్పందిస్తూ.. రణ్‌వీర్‌ను హగ్ చేసుకుంటానని తెలిపాడు. దీనిపై రణ్‌వీర్ సింగ్ సరదగా స్పందిస్తూ.. తు హగ్ అలియా కో దేదే, ఝుమ్కా ముఝే దేదే. తేరీ భాభి బాహోత్ ఖుష్ హో జాయేగీ అని అన్నారు. అంటే హగ్ ఆలియాకు ఇవ్వు.. నాకు మాత్రం ఆ ఝుంకాలు ఇవ్వు.. మీ వదిన దీపికా పదుకొనే కి ఇస్తే ఫుల్ ఖుషీ అవుతుంది అని అన్నారు రణ్‌వీర్. ఈస్టార్ హీరో చేసిన కామెడీకి అక్కడ ఉన్నవారే కాదు.. ఈ వీడియోలు సోషల్ మీడియలో చూస్తున్న నెటిజన్లు కూడా ఫన్ ఫీల్ అవుతున్నారు.
ఇక ఈ సినిమా జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానుంది. అంతే కాదు ఈసినిమాకు ఉన్న మరో విశేషం ఏంటీ అంటే దాదాపు ఆరేళ్ళ తరువాత కరణ్‌జోహార్ డైరెక్షన్ చేశారు. అంతే కాదు గతంలో గల్లీబాయ్ సినిమా తరువాత రణ్‌వీర్ – అలియా కలిసి నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈమూవీకి ప్రీతమ్ చక్రవర్తి స్వరాలు అందిస్తుండగా.. బాలీవుడ్ లెజెండ్ నటుడు ధర్మేంద్ర , ప్రీతి జింటా, అంజలి ఆనంద్, షబానా అజ్మీ లాంటి స్టార్ కాస్ట్ నటించారు.
