Asianet News TeluguAsianet News Telugu

"83" OTT: రణ్‌వీర్‌ సింగ్ "83" స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

 రూ. 270 కోట్లతో తెరకెక్కిన  ఈ చిత్రం  మన దేశంలో ఓమిక్రాన్ భయం నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు  థియేటర్స్‌లో  సగం ఆక్యుపెన్షీ విధించడం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది.

Ranveer Singh 83 Biopic OTT Streaming
Author
Mumbai, First Published Jan 29, 2022, 6:36 PM IST

 ఈ మధ్యకాలంలో సిని అభిమానులు ఎక్కువగా ఎదురుచూసిన చిత్రాలలో ఒకటి ‘83’. టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం . కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. కపిల్‌దేవ్‌ భార్యగా రణ్‌వీర్‌ సరసన దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ మధ్యన విడుదలైంది. అయితే సినిమా భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. గతేడాది డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అనుకున్నట్టే విదేశాల్లో ఈ మూవీ మంచి వసూళ్లనే సాధించింది.

 కానీ మన దేశంలో మాత్రం అనుకున్నంత రేంజ్‌లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేయ లేదు. రూ. 270 కోట్లతో తెరకెక్కిన  ఈ చిత్రం  మన దేశంలో ఓమిక్రాన్ భయం నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు  థియేటర్స్‌లో  సగం ఆక్యుపెన్షీ విధించడం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. ఇక ఈ సినిమాను చూసిన సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు చూసి ‘83’ మూవీ అద్భుతం అంటూ కితాబు ఇచ్చినా.. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

బాక్సాఫీస్ దగ్గర డబుల్ డిజాస్టర్‌గా నిలిచిన ‘83’ మూవీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్ స్టార్‌‌లో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

చిత్రంలో అప్పటి ప్రపంచకప్‌ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనందక్షణాలను మరోసారి ఈ సినిమా రివైండ్ చేస్తుందని ట్రైలర్ వచ్చినప్పటినుంచి క్రీడాభిమానులు ఎదురుచూసారు.  ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది...అభిమానుల అంచనాలకు అందుకుందా అంటే లేదనే చెప్పాలి.
   
‘అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ ’ ఇది. ఈ కథ ఓ తరానికి ఇప్పటికి కళ్ళకు కట్టినట్లే ఉంటుంది. దాన్ని ఈ తరానికి ఆసక్తిగా అందించటమే దర్శకుడు చేసిన పని.  భార‌త క్రీడా చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం "1983" అనేదాన్ని మరోసారి గుర్తు చేసారు. ముఖ్యంగా  1983 నాటి ఇండియా వరల్డ్ కప్ గెలవటానికి ముందు ఉన్న వాస్తవ పరిస్దితులను ఈ సినిమా మన ముందు పరుస్తూ సినిమాని ఓపెన్ చెయ్యటం బాగుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios