అభిమానం డోస్ ఎక్కువైతే హీరోలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అందుకే మన స్టార్ హీరోలు చాలా వరకు అభిమానులను కంట్రోల్ లో ఉండే విధంగా ఎక్కడికెళ్లినా జాగ్రత్తగా అడుగులేస్తారు. అభిమానుల తాకిడికి కోపం ఎంతోచ్చినా బాధ ఎంత కలిగినా కంట్రోల్ లో ఉండాలి. అలాగే ప్[ప్రేమొచ్చినా కూడా కంట్రోల్ లో ఉండాలని ఇటీవల రన్ వీర్ ను చూసి నేర్చుకోవాల్సిందే. 

మనోడికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రన్ వీర్ లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. సినిమాల్లో హీరో పాటలో జనాల మీదకు దూకితే ప్రేమగా మోస్తారని నిజ జీవితంలో కూడా రన్ వీర్ అలానే చేశాడు. అయితే ఈ ట్రిక్ ఫెయిల్ అయ్యింది. అంతే కాకుండా కొంత మంది లేడి ఫ్యాన్స్ కి గాయాలయ్యాయి. 

మనోడు చేసిన పనికి అంత మితిమీరిన ఓవరాక్షన్ ఎందుకు చేయడం అంటూ నెటిజన్స్ చురకలంటిస్తున్నారు. కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎందుకు ప్రవర్తించడమని గతంలో ఎప్పుడు లేని విధంగా రణ్ వీర్ తీరుపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.