ఇటీవల టెంపర్ రీమేక్ సింబా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. ఇక నెక్స్ట్ గల్లీ బాయ్ అని సింపుల్ క్యారెక్టర్ తో రాబోతున్నాడు. సింబా సినిమాలో పోలీస్ క్యారెక్టర్ తో మాస్ లో కనిపించిన ఈ స్టైలిష్ స్టార్ నెక్స్ట్ క్యారెక్టర్ మాత్రం చాలా క్లాస్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. విభిన్న కథలను ఎంచుకోవడంలో ఈ హీరో స్టైలే వేరు. 

ఇకపోతే టాలీవుడ్ రీమేక్ ఈ హీరో మార్కెట్ ను పెంచడంతో నెక్స్ట్ కూడా మరో తెలుగు సినిమాను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. లిస్ట్ లో మహేష్ సినిమాలు ఉన్నట్లు సమాచారం. భరత్ అనే నేను - శ్రీమంతుడు సినిమాలపై ఓ కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక టీమ్ సెట్ చేసుకున్న రణ్ వీర్ మంచి తెలుగు సినిమా కథ కోసం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

సల్మాన్ ఖాన్ - అజయ్ దేవగన్ అలాగే అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు చాల సార్లు టాలీవుడ్ రీమేక్స్ లో నటించి వారి క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో రణ్ వీర్ కూడా టాలీవుడ్ సినిమాలను ఉపయోగించుకోవాలని ట్రై చేస్తున్నాడు. మరి అతని ప్రయత్నాలు ఏ స్థాయిలో వర్కౌట్ అవుతాయో చూడాలి.