Asianet News TeluguAsianet News Telugu

మేమూ మనుషులమే.. మాకు ఫీలింగ్స్ ఉంటాయి.. స్టార్ హీరోయిన్ సంచల వ్యాఖ్యలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ చాలా హ్యాపీగా ఉంటారు.. లగ్జరీ లైఫ్ ఉంటుంది.. వారికేం కష్టాలు ఉంటాయి లే అనుకుంటారు చాలామంది. కాని మేము మనుషులమే.. మాకు కష్టాలు ఉంటాయి అంటోంది ఓ స్టార్ హీరోయిన్.. ఇంతకీ ఎవరామె. 

Rani Mukerji Opens Up About Personal Struggles and Misconceptions of Celebrity Life JmS
Author
First Published Aug 26, 2024, 6:22 PM IST | Last Updated Aug 26, 2024, 6:22 PM IST

సినిమా వాళ్లను లగ్జరీ సింబల్ గా చూస్తుంటారు చాలామంది జనాలు. వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటారని.. వాళ్ళకు పెద్దగా కష్టాలేమి ఉండవి... పెద్ద పెద్ద బంగ్లాలు.. ఏసీ కార్లు.. ఫారెన్ ట్రిప్పులు.. ఎంజాయ్ మెంట్ ఉంటుందని చాలామంది అభిప్రాయం. కాని వారిక కూడా  కష్టాలూ, కన్నీళ్లూ ఉంటాయి. సెలెబ్రిటీలు అయినంత మాత్రాన వారి జీవితం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటే పొరపాటు. చాలామంది నటీనటులు తమ జీవితంలోని ఒడుదొడుకుల గురించి పంచుకుంటూ ఉంటారు. ఈ విషయాన్నే వెళ్ళడించింది ఓ బాలీవుడ్ హీరోయి. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..? 

 బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ కూడా తన జీవితంలో ఎదురైన కష్టాలు.. కన్నీళ్ళ గురించి రీసెంట్ గా వెల్లడించారు. ఓ వేదికపై మాట్లాడిన ఆమె.. చాలా విషయాలు పంచుకున్నారు. ఇంతకీ ఆమె ఏంటుందంటే.. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలోనే నా జీవితంలో కూడా విషాదం చోటుచేసుకుంది. 2020లో రెండోసారి గర్భం దాల్చాను. దురదృష్టవశాత్తు 5 నెలలకే బిడ్డను కడుపులోనే కోల్పోయాను. ఈ సంఘటన గురించి ఎవ్వరికీ తెలియదు అన్నారు. 

అయితే తమ కష్టాలు చెప్పుకున్నా.. వాటిని ప్రమోషన్ల కోసం చెప్పుకుంటున్నారు అని కొంత మంది విమర్షిస్తున్నారని ఆమె వాపోయారు. అందుకే సినిమా ప్రమోషన్ల  విషయంలో తన పర్సనల్ విషయాలు తాను ఎప్పుడు చెప్పుకోలేదని ఆమె వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితానికి.. సినిమాలకు చాలా దూరం మెయింటేన్ చేస్తాన్నన్నారు రాణ ముఖర్జీ. ఇక తన జీవితంలో జరిగిన ఈ  చేదు జ్ఞాపకాన్ని అభిమానులతో  పంచుకున్నదామె.

ఈ సంఘటన తర్వాత పది రోజులకు నిర్మాత నిఖిల్‌ అద్వానీ ఫోన్‌ చేసి ‘మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే’ సినిమా కథ చెప్పారని ఆమె పేర్కొన్నది. ‘నార్వే లాంటి దేశంలో ఒక భారతీయ కుటుంబం అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదా అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. కానీ, నిజమని తెలిశాక వెంటనే ఆ చిత్రానికి ఓకే చెప్పాను’ అని చెప్పుకొచ్చింది రాణి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios