కావేరీ నందిని కాపాడుకోవడానికి సద్గురు 'కావేరీ కాలింగ్' పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్, కాజల్ అగర్వాల్, తమన్నాలు తమ మద్దతు తెలిపారు. 'కావేరి కాలింగ్' కోసం విరాళాలు అందించాలని అభిమానులను కోరారు.

ఈ క్రమంలో ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించే కంగనాలో ఇంత మార్పా..? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై కంగనా సోదరి రంగోలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కంగనా ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిందని..? చాలా మంది తనను ప్రశ్నిస్తున్నారని.. వారందరికీ నేను చెప్పే సమాధానం ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది రంగోలీ.

కంగనాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ కు సాయం చేసిందని.. వారికొక హాస్పిటల్ కట్టించిందని.. వివేకానంద ఆశ్రమంతో చేతులు కలిపి రూరల్ ఇండియా సంక్షేమం కోసం పాటు పడుతోందని చెప్పుకొచ్చింది.

కంగనాకు యోగా నేర్పించిన సూర్యనారయన్ ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని.. ఆయనకి రెండున్నర కోట్ల విలువైన ఇంటిని కట్టించి రుణం తీర్చుకుందని.. హిమాచల్ ప్రదేశ్ లో గ్రామస్తుల కోసం ఆలయాలు కట్టించిందని.. ఇప్పుడు తాను సంపాదిస్తున్న డబ్బు నుండి కొంత మొత్తాన్ని కావేరీ నది కోసం విరాళంగా ఇస్తుందని.. కంగనాఎప్పుడూ తన మంచి మనసును చాటుకుంటూ వచ్చిందని వెల్లడించింది. మూవీ మాఫియాకు కంగనాతో ఎన్ని సమస్యలు ఉన్నా.. ఆమె ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొంది.