Asianet News TeluguAsianet News Telugu

నాని ‘అంటే సుందరానికీ’ నుంచి ‘రంగో రంగ’ సాంగ్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని, నజ్రియ ఫహద్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. 
 

Rango Ranga song Released From Nani Ante Sundaraniki Movie
Author
Hyderabad, First Published May 23, 2022, 5:47 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో.. నేచురల్ స్టార్ నాని (Nani) చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం ఇచ్చిన సాలిడ్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆయన అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘అంటే సుందరానికీ’. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామాలో నాని సుందర ప్రసాద్ గా బ్రహ్మణ వేషధారణలో అలరించనున్నాడు. ఇక హీరోయిన్ నజ్రియా ఫహద్ (Nazriya Fahad) నాని సరసన ఆడిపాడనుంది. ఈ చిత్ర షూటింగ్ పార్ట్ పూర్తైయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించనున్న నాని ‘అంటే సుందరానికీ’తో కామెడీ పండించనున్నట్టు తెలుస్తోంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.  ‘రంగో రంగ’ అనే క్రేజీ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ కు లిరిసిస్ట్ సనాపతి భరద్వాజ్ పాత్రుడు చక్కటి లిరిక్స్ అందించారు. కాగా వివేక్ సాగర్  క్యాచీ ట్యూన్ ఇవ్వగా.. సింగర్ ఎన్సీ కారుణ్య అద్భుతంగా పాడారు. 

ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి ‘పంచెకట్టు’, ‘ఎంత చిత్రం’ సాంగ్స్ కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంటున్నాయి. అలాగే చిత్ర పోస్టర్స్, టీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం  జూన్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అదేవిధంగా నాని తన తదుపరి చిత్రం ‘దసరా’ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios