షాకింగ్ న్యూస్ : ఈ ఆదివారం థియేటర్ల నుండి రంగస్థలం తీసివేయబడుతుంది

First Published 4, Apr 2018, 11:59 AM IST
Rangasthalam Screening to be stop in Tamilnadu
Highlights
షాకింగ్ న్యూస్ : ఈ ఆదివారం థియేటర్ల నుండి రంగస్థలం తీసివేయబడుతుంది

 

కోలీవుడ్ లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. అక్కడ సినిమాలు విడుదలై చాలా రోజులు కావొస్తోంది.  తమిళ సినీ ప్రేక్షకులకు అసలే సినిమా పిచ్చి బాగా ఎక్కువ అంటారు. ఓ విధంగా అక్కడ సినిమాలు కూడా ఆ రేంజ్ లో ఉంటాయి అని అందరికి తెలిసిందే. వారం వారం ఓ సినిమా చూడకుండా ఉండడం అంటే అక్కడి వారికి కష్టమే.  కానీ అక్కడి TFPC తీసుకున్న నిర్ణయానికి అందరు కట్టుబడి ఉన్నారు. షూటింగ్ కాదు కదా కథల డిస్కర్షన్స్ కూడా జరగడం లేదు.

అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా అక్కడ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంచి ఓపెనింగ్స్ కూడా అందాయి. ఫస్ట్ డైరెక్ట్ సినిమా అత్యదిక వసూళ్లను అక్కడ అందుకుంది. అయితే  ఇప్పుడు ఆ సినిమా ప్రదర్శనని కూడా నిలిపివేసే పరిస్థితి వచ్చింది. సమ్మె కొనసాగుతున్న సందర్భంగా ఎలాంటి సినిమాల హడావిడి కొనసాగకూడదు అని అక్కడి వారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం నుండి తమిళనాడులోని థియేటర్లలో నుండి రంగస్థలం తీసివేయబడుతుంది. 

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వసూలు చేసిన అధిక రుసుమును నిరసిస్తూ కొనసాగుతున్న TFPC సమ్మె దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కూడా కొన్ని రోజుకు క్రితం ఈ విషయంపై సమ్మె చేసిన సంగతి తెలిసిందే. కానీ బడా సినిమాల దృష్ట్యా మళ్లీ పదిరోజుల్లోనే వెనకడుగు వేసింది.

loader