సోషల్ మీడియాలో పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతున్న రంగస్థలం

సోషల్ మీడియాలో పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతున్న రంగస్థలం

ఈ ఏడాది వేసవిలో సందడి చేయబోతున్న క్రేజీ చిత్రాలలో రంగస్థలం చిత్రం కూడా ఒకటి. సుకుమార్ శైలిలో రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలినుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా ఈ చిత్రంలో ప్రయోగమే చేయబోతున్నాడు.వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించబోతున్నాడు చరణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోని వినికిడి లోపంతో చూపించడం అంటే సాహసమే. 


కానీ అదే అంశం అభిమానులకు బాగా చేరువైంది. టీజర్ ట్రైలర్ లో రాంచరణ్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. ఇక వెండి తెరపై ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుందిపల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో ఈ చిత్రం సాగనుంది. టైలర్ లో చూపిన విధంగా ఈ చిత్రంలో ఆకట్టుకునే రాజకీయ అంశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి రామ్ చరణ్ సోదరుడిగా నటించాడు.


యూఎస్ లో ప్రిమియర్ షోలు పడ్డాయి అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అంటున్న నెట్టిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos