సందీప్ 'యానిమల్' లో హీరో క్యారక్టరైజేషన్ షాకింగ్
`అర్జున్ రెడ్డి` సినిమాతో సౌత్ లోనూ, దాని రీమేక్ `కబీర్ సింగ్`తో బాలీవుడ్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అయితే వెంటనే ఏ సినిమా చేయలేదు. లాంగ్ గ్యాప్ తీసుకున్న సందీప్ తర్వాతి సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో సందీప్ సినిమా చేయబోతున్నానని, ఈ చిత్రానికి `యానిమల్` అనే టైటిల్‌ను ఖరారు చేశానని అన్నారు.

`అర్జున్ రెడ్డి` సినిమా కథ మనకు పాత దేవదాసుని గుర్తు చేసినప్పటికీ ఓ విభిన్నమైన క్యారక్టరైజేషన్ తో దుమ్ము దులిపారు. అదే జనాలకు బాగా పట్టింది. ఇప్పుడు కూడా అలాంటి ఓ కొత్త క్యారక్టరైజేషన్ తో , తెరపై ఎవరూ చూపినంత విభిన్నంగా పాత్రను ప్రెజెంట్ చేయబోతున్నారట. దాంతో ఆ పాత్ర ఏమిటనే విషయమై బాలీవుడ్ లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు..ఈ సినిమాలో హీరో పెళ్ళైన ఒక సైకోగా కనిపిస్తాడు. రణబీర్ కపూర్ వంటి హీరోని అలా ఊహించగలమా అంటే అతను అలా తయారు కావటానికి లీడ్ చేసే సీన్స్ జస్టిఫై చేస్తాయంటున్నారు. అలాగే పరిణీతి చోప్రా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.
పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అనీల్ కపూర్ కీలక పాత్రలు పోషించబోతున్నారు. టీ-సిరీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2021 ద్వితీయార్దంలో సెట్స్ కు వెళ్లనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.
ఇక జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ప్రేమకథను ఇంత బోల్డుగా చూపించొచ్చా అనేలా అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డికి ఫిదా అయిన బాలీవుడ్.. సందీప్‌రెడ్డిని అక్కడికి తీసుకెళ్లింది. అక్కడ షాహిద్ కపూర్‌తో కబీర్ సింగ్‌గా తెరకెక్కించి కనక వర్షాన్ని కురిపించాడు.