Animal Trailer : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘యానిమల్’ ట్రైలర్.. తండ్రి కోసం ఊచకోత కోస్తున్న రన్బీర్
‘యానిమల్’ ట్రైలర్ విడుదలైంది. తండ్రీకొడుకుల బంధాన్ని చూపిస్తూ సందీప్ రెడ్డి వంగ మరోసారి సెన్సేషన్ గా మారబోతున్నారు. అన్నీ భాషల్లో విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్’ (AnimalThe Film). ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో ఆయన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మరో వారంలో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ క్రమంలో యూనిట్, స్టార్ కాస్ట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
ఈరోజు ‘యానిమల్’ నుంచి బిగ్ అప్డేట్ అందింది. పవర్ ఫుల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. Animal Trailer చాలా ఆసక్తికరంగా, సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. తండ్రీకొడుకుల మధ్య సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. తన తండ్రి తనకు సరైన సమయం ఇవ్వకపోవడం, దాని వల్ల కొడుకు ఎలాంటి స్థితికి లోనయ్యాడో తెలియజేశారు. తండ్రిని హీరోగా చూడటమే కాకుండా.. తన హీరో కోసమే యాక్షన్ తో ఊచకోత కోశారు. రక్తంలో సాగిన తండ్రి కొడుకు బంధం చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. సందీప్ రెడ్డి ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో ప్రజెంట్ చేశారనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రన్బీర్ కపూర్ చాలా షేడ్స్ లో కనిపిస్తుంటారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ మొత్తం ఎమోషన్, యాక్షన్ తో నిండిపోయింది. తండ్రి కొడుకుల బంధాన్ని వివరించే తీరు ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. గ్రాండియర్ గా సినిమాను వెండితెరపై ప్రజెంట్ చేయబోతున్నారనేది తెలుస్తోంది. ఈ ట్రైలర్ ను మొత్తం నాలుగు భాషల్లో విడుదల చేశారు. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోస్టర్లు, పాటలు, టీజర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. ట్రైలర్ కూడా సెన్సేషన్ గా మారుతోంది. చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిస్తుండటం విశేషం. వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.