టీజర్ డేట్ లాక్ చేసుకున్న ఆనిమల్, రణ్ బీర్ కపూర్ పోస్టర్ తో అనౌన్స్ చేసిన టీమ్..
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ ఆనిమల్. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.

బాలీవుడ్ లవర్ బాయ్ గా పేరున్న ప్లేబాయ్ రణ్ బీర్ కపూర్ ను రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో చూపించబోతున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక్కటే సినిమా అది కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. ఈసినిమా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో ప్రాజెక్ట్స్ సందీప్ కు వచ్చేలా చేసింది. అటు హిందీలో అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన సందీప్.. రెండో సినిమాను బాలీవుడ్ హీరోతో చేస్తున్నాడు.
బాలీవుడ్ చాక్లెట్ బాయ్, రొమాంటిక్ ఇమేజ్ ఉన్న రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అనే ఊరమాస్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ ప్రీ టీజర్ అదిరిపోయింది.ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ కు రెడీ అయిపోయారు టీమ్. టీజర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయిల పెరిగే అవకాశం క నిపనిస్తోంది.
ఇక తాజాగా ఆనిమల్ టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు టీమ్. రణ్ బీర్ కపూర్ స్పెషల్ పోస్టర్ తో... ఈ టీజర్ ను మాస్క్ రణ్‌బీర్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వగా టీజర్ కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సందీప్ నుంచి రాబోతున్న ఈ సెకండ్ ఫిల్మ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. యానిమల్ టీజర్‌తో ఈ సినిమా కథ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాను ముందుగా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడం వల్ల డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - 5 భాషల్లో విడుదల కానుంది.