Asianet News TeluguAsianet News Telugu

#Animal ‘యానిమల్‌’ తెలుగు వెర్షన్ ఎంతకు కొన్నారు, లాభం ఎంత?

 ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. తెలుగులోనూ బాగా ఆడింది. ఈ నేపధ్యంలో చిత్రం తెలుగు వెర్షన్ ఫైనల్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం.

Ranbir Kapoor Sandeep Reddy Vanga Movie Animal telugu version closing collections jsp
Author
First Published Feb 12, 2024, 8:34 AM IST | Last Updated Feb 12, 2024, 8:34 AM IST

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన లెటెస్ట్ చిత్రం ‘యానిమల్‌’ ఏ స్దాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ‘అర్జున్‌ రెడ్డి’ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలై మార్నింగ్ షో నుంచే ట్రేడ్ కు షాక్ ఇస్తూ అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్లింది.   కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించినా లెక్కలేదన్నట్లు అదరకొట్టింది.  థియేటర్లలోనేకాదు.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత నెలలోనే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఈ మూవీ.. పది రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ మూవీ.. రిలీజైనప్పటి నుంచీ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉండటం విశేషం. అంతకు వారం ముందు వచ్చిన సలార్ మూవీని వెనక్కి నెట్టి ఈ ఓటీటీలో అన్ని ఇండియన్ మూవీస్ రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగులోనూ బాగా ఆడింది. ఈ నేపధ్యంలో చిత్రం తెలుగు వెర్షన్ ఫైనల్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం.

 నైజాం    12.00 cr
సీడెడ్     2.42 cr
ఉత్తరాంధ్ర     3.40 cr
ఈస్ట్     1.56 cr
వెస్ట్     1.40 cr
గుంటూరు     1.61 cr
కృష్ణా     2.01 cr
నెల్లూరు     1.15 cr

ఏపీ + తెలంగాణ (టోటల్)    25.55 cr


ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్ కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.    

ఇక  ఇండియన్ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్స్ లో నంబర్ వన్ సినిమాగా ఉన్న యానిమల్.. ఇంగ్లిషేతర సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ లో తొలి వారంలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే. ఇదే ఊపులో 10 రోజుల్లోనే ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios