రన్బీర్ కపూర్ లేటెస్ట్ మూవీ యానిమల్ షూటింగ్ షురూ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.  

అర్జున్ రెడ్డి మూవీతో అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం సెన్సేషనల్ విజయం అందుకుంది. విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ చేసిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన కబీర్ సింగ్ 2019 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లు రాబట్టి కొత్త రికార్డ్స్ నమోదు చేసింది. కబీర్ సింగ్ హిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఇమేజ్ తెచ్చిపెట్టింది. 

ఈ క్రమంలో ఆయన రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)తో మూవీకి సైన్ చేశారు. యానిమల్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ నేడు స్టార్ట్ అయ్యింది. మానాలిలో యానిమల్ షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. చాలా కాలంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న యానిమల్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. 

Scroll to load tweet…

ఇక యానిమల్(Animal) మూవీలో రన్బీర్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేస్తున్నారు. రెండు భారీ విజయాలు ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగా నుండి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.అలాగే రన్బీర్ లాస్ట్ రిలీజ్ సంజూ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కాగా రన్బీర్ మరోవైపు బ్రహ్మాస్త్ర అనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. 

ఇక ఇటీవల రన్బీర్ తన ప్రేయసి అలియా భట్ ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఆడంబరాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. బ్రహ్మాస్త్ర మూవీలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున ఆర్కియాలజిస్ట్ రోల్ చేస్తున్నారు.