సందీప్ రెడ్డి వంగా చాలా గ్యాప్ తరవాత తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ఆడియన్స్‌కు మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో కిక్ ఇచ్చారు. 

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌బీర్ - తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా క‌ల‌యిక‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్ర‌మే... ‘యానిమ‌ల్‌ (Animal movie).గత కొన్నాళ్లుగా ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించిన విశేషాలే వినపడుతున్నాయి. రణ్‌బీర్‌ను సందీప్‌ ఎంత వైల్డ్‌గా చూపించారనేదే హాట్ టాపిక్ గా మారిపోయింది. తండ్రి,కొడుకల ఎమోషన్ తో రూపొందిన ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. బోల్డ్ అండ్ వైల్డ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా తాజాగా పది రోజులు పూర్తి చేసుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 717.46 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ కలెక్షన్స్ లో 200 కోట్లు ఓవర్ సీస్ నుంచి, 500 కోట్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాయి. అయితే తెలుగు వెర్షన్ ఓవర్ సీస్ లో మాత్రం పెద్దగా వర్కవుట్ కాకపోవటం షాక్ ఇస్తోంది.

తెలుగు వెర్షన్ కు మిక్సెస్ రివ్యూలు వచ్చినా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఓ రేంజిలో వచ్చాయి. ఇంక హిందీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఓవర్ సీస్ లో హిందీ వెర్షన్ $10 మిలియన్స్ కు చేరువైంది. అయితే తెలుగుకు వచ్చేసరికి ఒక మిలియన్ కూడా టచ్ కాకపోవటం విశేషంగా ట్రేడ్ మాట్లాడుతోంది. అయితే చాలా మంది ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ ని ప్రక్కన పెట్టి ఒరిజనల్ హిందీలోనే చూడటం వల్లే హిందీ కలెక్షన్స్ ఆ స్దాయిలో ఉన్నాయని వాదిస్తున్నారు. అయితే గతంలోనూ రణబీర్ సినిమాకు $10 మిలియన్స్ ఓవర్ సీస్ లో వచ్చాయనే విషయం గుర్తుంచుకోవాలని అంటున్నారు. కాబట్టి మన తెలుగు వాళ్లు ఓవర్ సీస్ లో ఇలాంటి సినిమాను పెద్దగా ఆదరించటం లేదని తేలిందంటున్నారు. 

సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే హీరో రణ్‌బీర్ కపూర్ భయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘యానిమల్ స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు.. నాకు ఇంకా గుర్తుంది.. డైరెక్టర్ సందీప్ స్క్రిప్ట్ నెరేట్ చేయడం పూర్తికాగానే నేను నా బాత్‌రూంలోకి వెళ్లాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. చాలా భయపడ్డాను. ఒక స్టోరీ, ఒక పాత్ర గురించి విని నేను భయపడటం ఇదే తొలిసారి. సందీప్‌తో పనిచేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇదొక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా. తండ్రీకొడుకుల ప్రేమకథ. ’ అని రణ్‌బీర్ కపూర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే 'యానిమల్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ సినిమాలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఓ రూల్ పెట్టాయి... థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల చేయాలని! నాలుగు వారాలకు స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్న సినిమాలను మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ప్రదర్శించడం లేదు. అందుకని, ఆరు నుంచి ఎనిమిది వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తోందట.