ఇటీవల ఓ సందర్భంలో మీడియా.. ప్రభుత్వం, రాజకీయాల తీరు గురించి రణబీర్ అభిప్రాయం అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఈ క్రమంలో నటి కంగనా ఆయన్ని టార్గెట్ చేస్తూ.. ఓ పౌరుడిగా ఆయనకి బాధ్యత లేదని విమర్శించారు.

ఆ వ్యాఖ్యలపై తాజాగా రణబీర్ స్పందించారు. ప్రజలు తమకు నచ్చినట్లు మాట్లాడొచ్చని అన్నారు. ఎవరైనా తనను ప్రశ్నించినప్పుడు సాధ్యమైనంత వరకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానని.. కానీ ఇలాంటి ప్రశ్నలకు(కంగనా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) సమాధానం ఇచ్చే ఆసక్తి లేదని అన్నారు.

వివాదాల్లో చిక్కుకోవడం అసలు ఇష్టం లేదని అన్నారు. ప్రజలు వారికి నచ్చిన కామెంట్లు చేయొచ్చని, వారి అభిప్రాయాలను చెప్పొచ్చని కామెంట్స్ చేసిన రణబీర్ తనకు ఏం మాట్లాడాలనే విషయం బాగా తెలుసునని అన్నారు.

కానీ ఆయన మాటల్లో ఎక్కడా కంగనా పేరుని మాత్రం ప్రస్తావించలేదు. కంగనా కేవలం రణబీర్ ని మాత్రమే కాదు.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులపై విమర్శలు చేసింది.