తమ గారాల కూతురు కోసం ఇప్పటికే ఆలియా భట్ రెండేళ్లు సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. ఇక ఇప్పుడు రణ్ బీర్ వంతు వచ్చింది. స్టార్ హీరో కూడా తన కూతురికోసం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. మరి అది ఎంత కాలమంటే..?  

బాలీవుడ్ స్టార్స్ పెళ్ళిళ్లు.. పిల్లలతో కళకళలాడిపోతుంది. ఇలా పెళ్ళి జరిగి.. అలా పిల్లలు పుట్టుస్తున్నారు. పెళ్ళైన ఏడాదే అంటే లాస్ట్ ఇయర్ పెళ్ళి చేసుకుని.. అదే ఏడాది పాపకు తల్లితండ్రులుగా మారారు రణ్ బీర్ కపూర్ , ఆలియా భట్. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సిద్థార్ధ్ మల్హోత్రా, కియారా అద్వాని కూడా ఇదేఫాలో అవుతున్నారని సమాచారం. ఇప్పటికే కియారా ప్రెగ్నెంట్ అని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..అదే నిజం అయితే.. ఈ ఏడాదే వారు కూడా తల్లితండ్రులు అనిపించుకోబోతున్నారు. 

ఇక తమగారాల పట్టికోసం ఆలియాభట్ చాలా నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా సినిమాలకుదూరంగా ఉండటం. దాదాపు రెండేళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ.. తన పిల్లను దగ్గర ఉండి చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యిందట. ఇక ఇదే బాటలో రణ్ బీర్ కపూర్ కూడా నడవబోతున్నాడట. బిజీ బిజీ షెడ్యూల్స్ తో తన కూతురి బాల్యాన్ని రణ్ బీర్ మిస్ అవుతున్నాడట. అందుకే తాన కూతురుతో టైమ్ స్పెండ్ చేయడం కోసం రణ్ బీర్ కపూర్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రణబీర్, శ్రద్దా కపూర్ కలిసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మార్చ్ 8న రిలీజ్ కానుంది. అయితే తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ మాట్లాడుతూ.. ఈ విషయాన్నివెల్లడించారు. ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాహా పుట్టినప్పటినుంచి సరిగ్గా తనకు టైం కేటాయించట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. సందీప్ తో చేసే యానిమల్ షూట్ లో నా పాత్ర షూట్ త్వరలో అయిపోతుంది. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు హాలిడే తీసుకుంటాను అన్నారు. 

ఆరు నెలల వరకు ఎలాంటి సినిమాలు, పని పెట్టుకోను. ఆరు నెలలు నా కూతురు రాహకే కేటాయిస్తాను. తనతో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను అని తెలిపాడు. దీంతో త్వరలో రణబీర్ సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్టు కన్ ఫామ్ అయ్యింది. ఇక ఆ టైమ్ ను తన కూతురితో గడపబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ రణ్ బీర్ కుసపోర్ట్ ఇస్తుననారు. రకరకాల కామెంట్లుపెడుతున్నారు. అన్నిపాజిటీవ్ గానే కామెంట్లురాస్తున్నారు.