Asianet News TeluguAsianet News Telugu

Ranbir Kapoor: కాస్ట్లీవాచ్ పెట్టుకున్న రణ్ బీర్ కపూర్, రేటెంతో తెలిస్తే షాక్ అవుతారు..

ఈమధ్య సోషల్ మీడియా జనాలకు, సెలబ్రిటీల ఫ్యాన్స్ కు ఒక్కటే పని.. స్టార్స్ ఏమైనా స్పెషల్ గా కాస్ట్లీ వస్తువులు పెట్టుకుని కనిపిస్తే చాలు వాటిని వైరల్ చేస్తున్నారు.. నెట్టింట్లో వాటి కాస్ట్ గురించి హడావిడి చేస్తున్నారు. తాజాగా ఈ ఆచారంబాలీవుడ్ కు కూడా పాకింది. రీసెంట్ గా రణ్ బీర్ కపూర్ పెట్టుకున్న వాచ్  ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. 
 

Ranbir Kapoor Costly Watch Viral In Animal Promotions JMS
Author
First Published Nov 19, 2023, 3:56 PM IST

టాలీవుడ్ లో ఎక్కువగా సెలబ్రిటీలు వాడే వస్తువులపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సోషల్ మీడియా జనాలు. ఈమధ్య సెలబ్రిటీల  ఫ్యాషన్స్ పై నెటిజన్లకు ఇంట్రెసట్ పెరిగిపోయింది.  టాలీవుడ్, బాలీవుడ్ తారలు ధరించిన డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర్నుంచి వాచ్, షూస్, గ్లాసెస్ ఇలా అన్నింటి గురించి, వాటి ధరల గురించి  నెట్టింట చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా.. ప్రభాస్ కార్లు.., మహేష్ బాబు షర్ట్స్.., ఎన్టీఆర్ వాచ్ లు..  అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి, వాటి కాస్ట్ గురించి  సోషల్ మీడియాలో  హడావిడి జరుగుతూనే ఉంది. 

ఇక తాజాగా  రణభీర్ కపూర్ ఫ్యానషన్ ఎంపికల గురించి న్యూస్  వైరలవుతుంది. నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ రణబీర్ కు ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఇప్పుడు ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ కు రెడీగాఉన్న ఈసినిమా ప్రమోషన్లు షురు అవ్వగా పెద్ద ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు టీమ్. 

ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో  రణబీర్ కపూర్ తో పాటు.. రష్మిక, డైరెక్టర్ సందీప్ వంగాకూడా బిజీ బిజీగా పాల్గొంటున్నారు. అంతే కాదు ఈ ఈవెంట్స్ లో రణ్ బీర్ కపూర్.. డిఫరెంట్ ఫ్యాషన్స్ ను ఫాలో అవుతూ.. కలర్ ఫుల్ గా కనిపిస్తూ.. సందడి చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా యానిమల్ ఈవెంట్లో పాల్గొన్న రణబీర్ తన స్టైలీష్ లుక్‏లో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన పెట్టుకున్న వాచ్ నెటిజన్ల కంట్లో పడింది. పాటేక్ ఫిలిప్ బ్రాండ్ కు చెందిన ఆక్వానాట్ సెల్ఫ్ వైండింగ్ వాచ్‌   72 నుంచి 80 లక్షల వరకూ ఉంటుందని  సమాచారం. 


అయితే ఈ విషయాన్ని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇండియన్ హారాలజీ ప్రకారం చెప్పాలంటే..  రణబీర్.. పటెక్ ఫిలిప్ 5168G-ఆక్వానాట్ వాచ్‌ని కలిగి ఉన్నారు. ఇది స్వీయ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్ వాచ్  బ్లూ ఎంబోస్డ్ డయల్, ట్రాపికల్ కాంపోజిట్ స్ట్రాప్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈవాచ్ కు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక రణ్ బీర్ కపూర్ యానిమల్ తో బిజీగా ఉన్నాడు. చివరిగా అతను  బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించారు.ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’లో కనిపించనున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న విడుదల కానుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ కూడా నటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios