Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ ఫెర్రారీ కారు... కాస్ట్ ఎంతో తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే...

ఈమధ్య ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీలు వాడే వస్తువులు, కార్లు, కాస్ట్యూమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫెరారీ కారు నెట్టింట వైరల్ అవుతోంది. దాని కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే మరి. 

Mega Power Star Ram Charan ferrari car Cost Viral JMS
Author
First Published Nov 24, 2023, 9:37 AM IST

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  ఈసినిమా తరువాత ఆయన రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు చరణ్. ఈమూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ మైసూర్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే గేమ్ ఛేంజర్ కంటే ముందు రామ్ చరణ్ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. రామ్ చరణ్ రెడ్ కలర్ ఫెరారీ కారులో సందడి చేశాడు. చరణ్ కు గేమ్స్ అన్నా..  గుర్రాలు అన్నా చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే..అలాగే కార్లంటే కూడా ఇష్టమని తెలుసు.. తాజాగా చరణ్ కి సంబంధించిన ఒక కారు అందులో ఉన్న చరణ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. చరణ్ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఖరీదైన కార్లెన్నో ఉన్నాయి. అయితే అందులో చాలా స్పెషల్ గా నిలుస్తోంది. ఫెరారీ కార్. 

రామ్ చరణ్ తాజాగా ఫెరారీ పోర్టోఫినో అనే మోడల్ కారులో వెళ్తు కెమెరాకి చిక్కాడు. రెడ్ కలర్ ఫెరారి లో రామ్ చరణ్ తన ఇంట్లోకి వెళ్తుంటే ఎవరో వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.ఇక అంతే నిమిషాల్లో ఆ వీడియో వైరల్ గా మారింది.ఆ వీడియో చూసిన వారందరు కారు మోడల్ సూపర్ గా ఉందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా జనాలు ఆగుతారా.. కారు కాస్ట్ గురించి ఎంక్వైరీ చేయగా.. అంతా షాక్ అయ్యారు.  ఆ కారు ఖరీదు అక్షరాలా 4 కోట్లు . 

ఆ ఖరుదు తెలిసిన ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ మొదట షాక్ అయినా కూడా ఆ తర్వాత చరణ్ రేంజ్ అంటే అంతేగా మరి అని అనుకుంటున్నారు. అలాగే కొంత మంది నెటిజన్లు మతిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ తరువాత బుచ్చిబాబు సానతో మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios