అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నుంచి రాబోతున్న విజువల్ వండర్ మూవీ 'బ్రహ్మాస్త్రం. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైనది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నుంచి రాబోతున్న విజువల్ వండర్ మూవీ 'బ్రహ్మాస్త్రం. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం అత్యంత శక్తివంతమైనది. ఈ బ్రహ్మాస్త్రం నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్రం చిత్ర మొదటి భాగం ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. 

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా నేపథ్యాన్ని మెగాస్టార్ అద్భుతంగా వివరించారు. నీరు, గాలి, నిప్పు.. వేల సంవత్సరాలుగా ఈ శక్తులు అన్ని కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది అంటూ చిరంజీవి తన పవర్ ఫుల్ వాయిస్ తో వివరించారు. 

ఆ బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికి తెలియదు. ఆ యువకుడే శివ అంటూ రణబీర్ పాత్రని పరిచయం చేశారు. ట్రైలర్ మొత్తం మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో సాహసోపేతమైన సన్నివేశాలతో సాగుతోంది. 

కథలోని పాత్రలంతా బ్రహ్మాస్త్రం వేటలో ఉన్నాయి. రణబీర్ కపూర్ కి శక్తులు ఉంటాయి. అగ్నితో అతడికి సంబంధం ఉంది. అగ్ని అతడిని ఏమీ చేయలేదు. అలాంటి యువకుడి చేతి రేఖల్లో బ్రహ్మాస్త్రం విధి ఎందుకు ఉంది.. తన కర్తవ్యాన్ని శివ ఎలా గుర్తించబోతున్నాడు అనేది ఈ కథలో భాగం. ఇక కింగ్ నాగార్జున కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నంది అస్త్రంగా నాగ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇక బ్రహ్మాస్త్రాన్ని చేజిక్కించుకునేందుకు దుష్ట శక్తులు కూడా పొంచి ఉన్నాయ్. వారిని రణబీర్ కపూర్ ఎలా ఎదుర్కొన్నాడో సినిమాలోనే చూడాలి. ట్రైలర్ అయితే అబ్బురపరిచే విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. బ్రహ్మాస్త్రం మొదటి భాగం సెప్టెంబర్ 9న పాన్ ఇండియా చిత్రంగా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. రాజమౌళి తెలుగులో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. 

YouTube video player