Asianet News TeluguAsianet News Telugu

Animal Movie: ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకున్న యానిమల్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఈరోజు (01 డిసెంబర్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్అయ్యింది రణబీర్ కపూర్ యానిమల్ మూవీ. పాజిటీవ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డిని మించి ఉందంటున్నారు. ఇక ఈమూవీ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడు ఓటీటీ పార్ట్నర్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Ranbir Kapoor Animal Movie Ott Release Date Update JMS
Author
First Published Dec 1, 2023, 9:21 AM IST

బాలీవుడ్ లో పాటు సౌత్ ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు యానిమల్ మూవీ కోసం. ఇక ఈమూవీ ట్రైలర్ వచ్చి.. ఆ అంచనాలు మరింత పెంచేశారు. మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు( డిసెంబర్ 01) రిలీజ్ అయ్యింది. ప్రీమియర్స్ టాక్ మాత్రం అద్భుతం అంటున్నారు. మరి కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.  

సందీప్ రెడ్డి డైరెక్షన్ లో.. రష్మిక మందన్న హీరోయిన్ గా..  రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటించిన యానిమల్... ఈ సినిమా  అర్జున్‌రెడ్డిని మించిపోయింది. రొమాన్స్ విషయంలో కాని.. వయోలెన్స్ విషయంలో కాని.. ఎక్కడా తగ్గలేదు. దర్శకుడు చెప్పినదాన్ని మించి చేశాడు రణ్ బీర్ కపూర్. ప్లే బాయ్, లవర్ బాయ్, రొమాంటిక్ హీరో లాంటి  షేడ్స్ నుంచి బయటకు వచ్చి రణబీర్ కపూర్.. తనలో ఉన్న మాస్ కోణాన్ని చూపించాడు. ఊరమాస్ అనిపించుకున్నాడు. దాంతో యానిమల్ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది . 

Animal Review:యానిమల్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఊపు ఊపేసిన రణబీర్ కపూర్, కాని..?

పాన్ ఇండియా మూవీ.. తెలుగు,  హిందీ భాషల్లో  రిలీజ్ అయిన ఈమూవీ ఆడియన్స్ ను అలరిస్తోంది. కాగా  తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డీల్ లాక్ అయ్యిపోయింది. యానిమల్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ యానిమల్ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే యానిమల్ హిందీ రైట్స్ ను సోనీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది.  యానిమల్ కు ఏ సర్టిఫికెట్ రావడంతో.. ఈమూవీ రేంజ్ అర్ధం అవుతోంది. 

Animal Review: యానిమల్ ప్రీమియర్ టాక్: వైలెన్స్ కి మీనింగ్ చెప్పిన వంగ, రన్బీర్ కెరీర్ బెస్ట్, టాక్ ఇదే!

అయితే ఓటీటీ సంస్థలు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకువస్తుండగా ఒక్కోసారి సినిమాకు వచ్చిన ఫలితాన్ని బట్టి అంతకన్నా ముందే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. భగవంత్ కేసరి , టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు అలా వచ్చినవే  కాగా  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ యానిమల్ సినిమా కూడా రిలీజ్ అయిన 8వారాల తర్వాత రిపబ్లిక్ డే రోజు జనవరి 26న ప్రముఖ  స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు  తెలుస్తోంది. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి రిలీజ్ కు సబంధించిన అప్డేట్ అఫీషియల్ గా రావల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios