‘విరాటపర్వం’ ఓటీటి రైట్స్ ఎవరికి, ఎంతకి?
మావోయిస్టు ఉద్యమం నేపథ్యంలో.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'విరాటపర్వం'. రానా మావోయిస్టుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రైట్స్ మంచి మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ హోల్ సేల్ గా తీసుకుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం ఆన్ లైన్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ రేటు 11 కోట్లు అని తెలుస్తోంది. క్రేజ్ ఉన్న డైరక్టర్, బాహుబలితో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లిన రానా హీరో కావటం, సాయిపల్లవి హీరోయిన్ కావడం ఈ సినిమా ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కు ఆ రేటు వచ్చింది.
ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానా రవన్న అనే నక్సలైట్ క్యారెక్టర్ ను చేస్తున్నాడు. సాయిపల్లవి అతనికి జోడీగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వం చిత్రంలో కూడా కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం అంటూ దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. 1990లో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు దర్శకుడు తెలిపారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.