Asianet News TeluguAsianet News Telugu

'రణరంగం' ప్రీ రిలీజ్ బిజినెస్!

ట్రేడ్ సమాచారం మేరకు 'రణరంగం' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ..16 కోట్లు దాకా చేసింది. దాంతో 17 కోట్లు అయినా షేర్ వస్తే సేఫ్ వెంచర్ అని చెప్తున్నారు. ఏరియాల వారిగా ఈ చిత్రం బిజినెస్ లెక్కలు ఇవీ..

Ranarangam Worldwide Pre Release Business
Author
Hyderabad, First Published Aug 14, 2019, 1:49 PM IST

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిన్‌ల కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల అవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఏ మేరకు బిజినెస్ చేసింది అనేది ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్  పాయింట్ గా మారింది. 

ట్రేడ్ సమాచారం మేరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ..16 కోట్లు దాకా చేసింది. దాంతో 17 కోట్లు అయినా షేర్ వస్తే సేఫ్ వెంచర్ అని చెప్తున్నారు. ఏరియాల వారిగా ఈ చిత్రం బిజినెస్ లెక్కలు ఇవీ..
 
ఏరియా                               బిజినెస్ (కోట్లలో)

--------------------                ----------------------------------------

నైజాం                                        5.00

సీడెడ్                                      2.00

నెల్లూరు                                    0.50

కృష్ణా                                        1.00

గుంటూరు                                 1.20

వైజాగ్                                     1.50

ఈస్ట్ గోదావరి                          1.00

వెస్ట్ గోదావరి                       0.80

ఆంధ్రా మరియు తెలంగాణా                13.00

కర్ణాటక                                                 0.90

భారత్ లో మిగతా ప్రాంతాలు               0.30

ఓవర్ సీస్                                           1.80

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్              16.00 
 
మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల్లో ‘గాడ్‌ ఫాదర్‌’ టాప్‌. ఆ సినిమా స్ఫూర్తితో ‘రణరంగం’ స్ర్కీన్‌ప్లే ఉంటుంది. భూత, వర్తమానాలను చూపిస్తూ కొత్తగా తీశారని చెప్తున్నరు. - ఎన్టీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మధ్యపాన నిషేధం విధించారు. అప్పటి పరిస్థితుల్లో, విశాఖ నేపథ్యంలో ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగితే ఎలా ఉంటుందని రాసిన కథ. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు ఏం లేవు అని నిర్మాతలు చెప్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios