ఒక హీరోను అనుకుని రాసుకున్న కథను ఆ తర్వాత రకరకాల కారణాలతో వేరే హీరో చేయటం ఇండస్ట్రీలో ఎప్పుడు నుంచో జరుగుతున్నదే. సినిమా రిలీజ్ అయ్యి హిట్టాయ్యాక..అరెరే మంచి సినిమా మిస్ చేసుకున్నామే అని హీరోలు బాధపడటమో లేక సినిమా ఫ్లాఫ్ అయితే ..హమ్మయ్య..మనకు ఓ ప్లాఫ్ తప్పిందని సంబరపడటమో జరుగుతూంటుంది. ఇప్పుడు  ‘రణరంగం’  సినిమా విషయంలో కూడా అలాంటి ఓ చిన్న ముచ్చట జరిగిందని తెలుస్తోంది.

అదేమిటంటే.. హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో ‘రణరంగం’ సినిమా రేపు (ఆగష్టు 15)  విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి  ఫిల్మ్ సర్కిల్స్‌ లో హాట్ టాపిక్ గా మారింది. రణరంగం కథను డైరెక్టర్ సుదీర్ వర్మ ముందుగా రవితేజకు చెప్పారట. ఫస్ట్ వినగానే రవితేజకి కూడా రణరంగం కథ బాగా నచ్చిందట. కానీ ఆ తరువాత డ్యూయిల్ రోల్, ఎక్కువ రోజులు డేట్స్, తను చెప్పిన కొన్ని మార్పులకు సుధీర్ వర్మ ఇష్టపడకపోవటం వంటి  కొన్ని కారణాల వల్ల చేయలేదట. దాంతో రణరంగం కథ ని శర్వానంద్‌ చెప్పటం...అతను ఇంట్రస్ట్ చూపించాడట. 

ఇక ‘గ్యాంగ్‌స్టర్’గా ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర శర్వా గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా, ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్‌తో కూడినదై ఉంటుందట. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర హీరో జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ.