టాలీవుడ్ టాలెస్ట్ హీరో రానా దగ్గుబాటి భార్య.. మిహికా బజాజ్ ప్రగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈవార్తలపై స్పందించింది రానా సతీమణి.
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రానా, మిహికా కూడా ఉన్నారు. పెళ్ళైమూడేళ్ళకు పైగా అవుతున్నా.. ఇంకా కొత్త జంటలా మెరిసిపోతుంటారు వీరు. అన్నోన్యంగా ఉంటూ.. అందరిమెప్పు పొందుతున్నారు. మిహికా కూడా సినిమాస్టార్ కాకపోయినా.. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సాధించడమే కాదు.. రానాతో కలిసి ఈవెంట్స్ లో కూడా అప్పుడుప్పుడు కనిపిస్తుంటుంది. ఇద్దరు తమకుసబంధించి విషయాలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు కూడా. ఈక్రమంలో అవి వైరల్ అవుతుంటాయి.
రానా, మిహీకాలు రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వెంకటేష్ కూతురు ఫ్రెండ్ అయిన మిహికాను చూసి.. ప్రేమించాడు రానా. అందరికి ఒప్పించి ఆమెను లవ్ మారేజ్ చేసుకున్నాడు. అప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రానా ఫ్యాన్స్ దగ్గుబాటి వారసుడి గురించి అడుగుతున్నారు. సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు మిహికా ప్రస్తుతం ప్రగ్నెంట్ అంటూ.. కొంత మంది నెటిజన్లు పోటా పోటీగా ప్రచారం కూడా చేస్తున్నారు. త్వరలో దగ్గుబాటి వారుసుడు రాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఈ విషయంలో రానా స్పందించకపోయినా.. మిహికా మాత్రం స్పందించింది. అన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.
తాజాగా ఆ వార్తలపై మిహీకా స్పందించింది. నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య బరువు పెరిగి కాస్త బొద్దుగా కనిపిస్తున్నానంతే. నిజంగా నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా అంటూ ప్రెగ్నెన్సీపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇక తనకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
ఇంతకు ముందు కూడా వీరి విషయంలో చాలా రూమర్స్ ప్రచారం జరిగాయి. వారు పిల్లలు వద్దు అనుకున్నారని. ఆ విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పారని. ఎవరైనా అనాథ పిల్లలు ఇద్దరిని తీసుకుని వచ్చి పెంచుకోబోతున్నారంటూ.. న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంలో కూడా వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో చడాలి.
