త్వరలో తండ్రి కాబోతున్న రానా.. మిహికా బజాజ్ ఏమన్నదంటే..?
చాలా కాలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న హీరో రానా దగ్గుబాటి.. సడెన్ గా పెళ్ళి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు రానా తండ్రికాబోతున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
చాలా రోజుల వరకు పెళ్లికి దూరంగా ఉన్న రానా ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. 2020 ఆగస్టు8న మిహికా బజాజ్‌ని పెళ్ళి చేసుకున్న రానా.. బ్యాచిలర్ లైఫ్ కు పుల్ స్టాప్ పెట్టాడు. వీరి పెళ్ళి కూడా కరోనా బ్రేక్ టైమ్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రానా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లో తన లవ్ స్టోరీ చెపుతూ.. తన మ్యారీడ్ లైఫ్ ఎట్లా ఉందో వివరిస్తూనే ఉన్నాడు.
ఇక రానా భార్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం మిహికా పోస్ట్ చేసిన ఫొటోలే. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చూసిన జనాలకు డౌట్ వచ్చింది.
మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికపుడు షేర్ చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత పోస్ట్ చేసిన ఫొటోల కంటే..రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోలో మిహికా కొద్దిగా బొద్దుగా ఉన్నారు. దీంతో అభిమానులు మిహికా మీరు తల్లికాబోతున్నారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మిహికా చాలా చక్కగా సమాధానం చెప్పారు. అలాంటిదేమి లేదు.. పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే సహజ మార్పు మాత్రమే ఇది అని అన్నారు.
రానా సతీమణి మిహికా సమాధానంతో అభిమానులకి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం రానాకు 37 ఏళ్లు కాగా.. మిహికాకు 28 ఏళ్లు. ఇక రానా రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగా రానా నటించారు. పవన్ తో పాటు రానా యాక్టింగ్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్ తో కలిసి నాయుడు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. అటు విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.