విజయవాడ: ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్రకు నటుడు ఖరారయ్యారు. ఈ పాత్రను రానా పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న హీరో బాలకృష్ణ స్వయంగా చెప్పారు. 

దర్శకుడు క్రిష్, తదితరులతో కలిసి బాలృష్ణ శనివారంనాడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఎన్టీఆర్ బయోపిక్ ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదని అన్నారు, షూటింగ్ శరవేగంగా సాగుతోందని చెప్పారు. 

నిమ్మకూరులో పర్యటిస్తుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తోందని అన్నారు. ఎన్టీఆర్ చిన్ననాటి స్నేహితులను కలిశామని చెప్పారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ గురించి రోజుకో విషయం కొత్తగా తెలుస్తోందని దర్శకుడు క్రిష్ అన్నారు.