Asianet News TeluguAsianet News Telugu

రానా ‘అరణ్య’కి కరోనా దెబ్బ,అక్కడ రిలీజ్ వాయిదా

శుక్రవారం రానా నటించిన పాన్ ఇండియా ఫిలిం అరణ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల ప్లాన్ చేసారు. సౌత్ లో అరణ్య మూవీ ప్రమోషన్స్ కూడా దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే అరణ్య ట్రైలర్ లాంచ్, అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ క్రేజ్ క్రియేట్ చేసారు. మరోపక్క రానా మీడియాతో ఇంటర్వూస్ జరుగుతున్నాయి. అరణ్యపై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు   అరణ్య కి కరోనా బ్రేకులు వేసింది. నార్త్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో అరణ్య హిందీ వెర్షన్ హథీ మేరే సాథి అక్కడ మార్చ్ 26 న విడుదల చెయ్యడం లేదు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తన ట్విట్టర్ ఖాతాలో  ఈ విషయాన్ని తెలియజేసింది.
 
Rana Haathi mere saathi movie not releasing jsp
Author
Hyderabad, First Published Mar 24, 2021, 9:04 AM IST

శుక్రవారం రానా నటించిన పాన్ ఇండియా ఫిలిం అరణ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల ప్లాన్ చేసారు. సౌత్ లో అరణ్య మూవీ ప్రమోషన్స్ కూడా దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే అరణ్య ట్రైలర్ లాంచ్, అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ క్రేజ్ క్రియేట్ చేసారు. మరోపక్క రానా మీడియాతో ఇంటర్వూస్ జరుగుతున్నాయి. అరణ్యపై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు   అరణ్య కి కరోనా బ్రేకులు వేసింది. నార్త్ లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో అరణ్య హిందీ వెర్షన్ హథీ మేరే సాథి అక్కడ మార్చ్ 26 న విడుదల చెయ్యడం లేదు. ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ నౌ తన ట్విట్టర్ ఖాతాలో  ఈ విషయాన్ని తెలియజేసింది.

 కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా.. సినిమాలను వాయిదా వేయాలని భావిస్తున్నారు పలు చిత్రనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో రానా నటించిన హాథీ మేరీ సాథీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 

  ” ప్రియమైన ప్రేక్షకులకు.. ఈ వార్తను మీతో పంచుకోవడం బాధాకరం. కొవిడ్‌19 మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తర్వాతి అప్డేట్‌ గురించి త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్‌’ యథావిధిగా మార్చి 26న విడుదలవుతాయి’ అని పేర్కొంది. కానీ ఈ సినిమా విడుదల కేవలం హిందీ వెర్షన్ మాత్రమే వాయిదా పడింది. చిత్రయూనిట్ ముందుగానే ప్రకటించిన తేదీకి తెలుగు, తమిళ్ వెర్షన్స్‏లో మార్చి 26న విడుదల కానుంది.  

‘ఫిల్మ్‌ మేకర్స్‌గా మేము ప్రేమ కోసం, రైతుల కోసం, సమాజం కోసం, రకరకాల సమస్యల కోసం పోరాడుతుంటాం. అలా ఏనుగుల కోసం చేసిన పోరాటమే అరణ్య’ అని అన్నారు దర్శకుడు ప్రభు సాల్మన్‌. సుమారు నాలుగేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాను. ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జాదవ్‌ గారిని నేను కలవలేదు. అందరూ అనుకుంటున్నట్టు ఇది ఆయన కథ కాదు. ఆయన స్ఫూర్తిని తీసుకున్నా అంతే. ఏనుగులు, ఏనుగులు గోడను కూల్చడం (ఎలిఫెంట్‌ వార్‌) ఆధారంగా రాసుకున్న స్ర్కిప్టు ఇది. ఏనుగుల కోసం పోరాడటం, ఏనుగుల గళం వినిపించడమే ఈ ‘అరణ్య’ ఇతివృత్తం. దర్శకులుగా, హీరోలుగా మేము ప్రేమ కోసం, సమాజం కోసం, రైతుల కోసం, రకరకాల సమస్యలపై పోరాడతాం. ప్రకృతి గురించి చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. కరోనా నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. ప్రకృతిని మనం ఎలా ఇబ్బంది పెట్టామో ఇప్పటికైనా తెలుసుకోవాలి అన్నారాయన. 
 
Follow Us:
Download App:
  • android
  • ios