విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా ‘విరాటపర్వం 1992’ అనే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుంది.
విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా ‘విరాటపర్వం 1992’ అనే కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుంది. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. కాగా ఈ సినిమాలో రానా పాత్ర పై ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయిటకు వచ్చింది.
ఇందులో రానా నక్సలైట్ గా కనిపించనున్నారని, సాయిపల్లవి అతనితో ప్రేమలో పడి ఇబ్బందులు పడే పాత్ర అని చెబుతున్నారు. జనవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందట.
మొదట ఈ సినిమా కోసం నాని లేదా నితిన్‌ను తీసుకోవాలని దర్శకుడు అనుకున్నారు. కానీ నితిన్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో శర్వానంద్‌ను కలిశారట. ఆయనది అదే పరిస్దితి.. ఖాళీ లేకపోవడంతో రానాను సంప్రదించినట్లు తెలిసింది.
ఇక రానా ప్రస్తుతం ‘యన్.టి.ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లోనూ రానా నటిస్తున్నారు. సాయిపల్లవి ఇటీవల ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది.
