టాలీవుడ్ అగ్ర హీరో రానా 'బాహుబలి' సినిమాలో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకున్నాడు. భల్లాలదేవ లుక్ లో రానా గెటప్ చూసిన వారు షాక్ అయ్యారు. అలాంటి వ్యక్తి సడెన్ గా సన్నబడిపోయాడు. ఎముకుల గూడు తరహాలో మారిపోయి గడ్డం బాగా పెంచుకొని కొత్త లుక్ తో షాకిచ్చాడు.

చాలా తక్కువ సమయంలో రానా సన్నబడడంతో అతడి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. రానాకి కిడ్నీ సమస్య ఉందని.. అందుకే అతడు బరువు తగ్గాడని కొన్ని మీడియా వర్గాలు వార్తలు ప్రచురించాయి.

తాజాగా ఈ విషయంపై రానా స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా తను బరువు తగ్గడానికి గల కారణాలను వెల్లడించాడు. తను నటిస్తోన్న కొత్త సినిమా 'హతీ మేరీ సాథీ'లో ఓ ముప్పై ఏళ్ల పాటు కేవలం అడివిలోనే గడిపిన వ్యక్తి పాత్రను పోషిస్తున్నానని.. దాని కోసం ఇంత సన్నబడాల్సి వచ్చిందని.. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మళ్లీ కండలు పెంచుతానని అన్నాడు రానా.

అతడి మాటలు బట్టి ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. ఇక ఇదే లుక్ తో 'విరాటపర్వం 1992' అనే సినిమాలో నటిస్తున్నాడు రానా. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది.