రానా.. విలనా - హీరోనా? అంటే కథను బట్టి తనను తాను మార్చుకోవడంలో కింగ్ అనిపించుకుంటాడు అనేది ఆయనను అభిమానించే వారి ఆలోచన. నిజంగానే రానా కంటెంట్ ని బట్టి సినిమాకు న్యాయం చేస్తుంటాడని చాలా సార్లు రుజువయ్యింది. ఇకపోతే రీసెంట్ గా ఇంగ్లీష్ వెబ్ సైట్లపై రానా ఘాటుగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. 

రానా డైరెక్ట్ ఎటాక్ అయితే జరుపలేదు గాని పలు ఇంగ్లీష్ వెబ్సైట్స్ దూకుడుకు కౌంటర్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.  ఇంతకీ రానా ఏమన్నాడంటే.. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని అర్ధం చేసుకోలేక కొన్ని ఇంగ్లీష్ వెబ్ సైట్లు కనీసం హాస్యమంటే ఏమిటో కూడా తెలియకుండా నడుచుకుంటున్నాయి. నిలదీయడం కడిగేయడం వంటి వంటిని మానేసి చాలా కాలమవుతోంది. 

మళ్ళీ అది చేయనివ్వకండి అంటూ నన్ను రెచ్చగొట్టొద్దు అన్నట్లు ట్విట్టర్ లో  కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా సెలవులు ఎంజాయ్ చేయండి అంటూనే.. పర్సనల్ గా కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం అన్నట్లు వివరణ ఇచ్చాడు. దీంతో రానా ఎవరిని టార్గెట్ చేశాడన్నది కాస్త అనుమానంగానే ఉన్నా బహుశా రానా యాంకరింగ్ పై ఇటీవల ట్రోల్ చేసిన ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు వార్నింగ్ ఇచ్చాడా? అన్నట్లు టాక్ వస్తోంది.