శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల వేగం పెరుగుతోంది. సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తున్నారు. రానా ఈ బయోపిక్ కి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. 

అయితే ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్రికెటర్ గా మురళీధరన్ కెరీర్ మొదలైన తరువాత తన బౌలింగ్ తో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఎన్నో రికార్డులు అందుకున్నాడు. 

అయితే కెరీర్ మొదలవ్వడానికి ముందు మురళీధరన్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అందరికి స్ఫూర్తినిచ్చే ఒక మంచి సందేశం అతని జీవితంలో దాగి ఉంది. ఎన్నో సంఘటనలను కూడా  దైర్యంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతని కథను తెరకెక్కించాలని అనిపించినట్లు రానా వివరణ ఇచ్చాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేస్తామని కూడా రానా మాట్లాడారు.