త్వరలో దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి అభిరామ్ కూడా ఇటీవల టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అభిరామ్ నటించిన డెబ్యూ మూవీ అహింస బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. 

దీనితో అభిరామ్ మరో వైవిధ్యమైన సబ్జెక్టుతో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. దీనికోసం నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం కంటే ముందే అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఫిలిం నగర్ లో బలమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఇటీవల అభిరామ్ కి పెళ్లి సంబంధం కుదిరినట్లు తెలుస్తోంది. అభిరామ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. వాళ్ళ బంధువుల అమ్మాయినే అట. రామానాయుడు తమ్ముడి మనవరాలినే(రామానాయుడు తమ్ముడి కూతురు బిడ్డ) అభిరామ్ కి కాబోయే భార్యగా కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాహం జరగడం దాదాపు ఖాయం అని.. ఇక దగ్గుబాటి కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన మాత్రమే రావలసి ఉందని అంటున్నారు. 

హీరోగా ఎంట్రీ కాకముందే అనేక వివాదాల్లో అభిరామ్ నిలిచాడు. ఇప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు అభిరామ్ సోదరుడు రానా దగ్గుబాటి విలక్షణ నటుడిగా ఇండియా మొత్తం గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.