ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ గా రానా

మెగాస్టార్ చిరంజీవి దశాబ్ద కాలం తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం టీం మెగా ఈవెంట్ ప్లాన్ చేసింది. మెగాస్టార్ 150వ చిత్రానికి సంబంధించిన మెగా ఈవెంట్ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా సెలిబ్రేట్ చేసేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఈవెంట్ కు రోటీన్ గా కాకుండా యాంకర్ గా వ్యవహరించేందుకు రొటీన్ యాంకర్లను పక్కనబెట్టి స్టార్ ను యాంకరింగ్ చేసేందుకు అడిగారట. ఆ స్టార్ మరెవరో కాదు భల్లాల దేవుడు దగ్గుబాటి రానా.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150 చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌న‌వ‌రి 4న భారీ స్ధాయిలో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే...ఈ ఫంక్ష‌న్ కి సుమ యాంక‌రింగ్ చేస్తుంది అనుకున్నారు కానీ...ఊహించ‌ని విధంగా ఈ కార్య‌క్ర‌మానికి ద‌గ్గుబాటి రానా యాంక‌రింగ్ చేస్తున్నార‌ని స‌మాచారం. రానాతో పాటు న‌వ‌దీప్ కూడా యాంక‌రింగ్ చేస్తున్నార‌ని తెలిసింది. ఈ భారీ కార్య‌క్ర‌మానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిన‌హా మిగిలిన మెగా హీరోలు అంద‌రూ హాజ‌ర‌వుతార‌ట‌.

ఖైదీ నెం 150 చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇక దేవి స్టేజ్ పై ఉంటే ఎన‌ర్జి ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రెగ్యుల‌ర్ ఆడియో ఫంక్ష‌న్స్ లా కాకుండా చాలా కొత్త‌గా ఉండేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి...కొత్త‌గా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి..!