టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఎంత బద్దకస్తుడో రాజమౌళిని అడిగితే కరెక్ట్ గా చెబుతారు. అదే విధంగా ఒకసారి షూటింగ్ పనిలోకి దిగితే పని రాక్షసుడు అయిపోతాడని కూడా జక్కన్న గతంలో చాలా సార్లు చెప్పాడు. ఇకపోతే అతని నుంచి రానా ఒక విషయాన్నీ మాత్రం బాగా గుర్తించాడు. అది తాను కూడా అలవాటు చేసుకునేందుకు నేర్చుకుంటున్న అని వివరణ ఇచ్చాడు. 

ప్రభాస్ లో చాలా సహనం ఉంది. బాహుబలి కోసం ఏకంగా 5 సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఐదేళ్లలో అతను ఎన్ని సినిమాలకైనా డేట్స్ ఇవ్వవచ్చు. మరింత డబ్బు సంపాదించవచ్చు. కానీ అతను అలా చేయలేదు. ఒక మంచి నాణ్యత గల కెరీర్ కోసం సహనంతో మంచి సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడని తనదైన శైలిలో  తెలిపాడు. 

ఈ ఒక్క విషయం ప్రభాస్ నుంచి అలవాటు చేసుకుంటున్న ఈ హీరో అలస్య మయినా పరవాలేదు అని డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  బాహుబలి ఫస్ట్ పార్ట్ సెట్స్ పై ఉండగానే ఒకే చేసిన ఈ సినిమాను ప్రభాస్ ఈ ఏడాది పూర్తిచేయనున్నాడు. ఆగష్టులో సినిమా రిలీజ్ కానుంది.