టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతోంది. ఇక రెమ్యునరేషన్ లో అయితే స్టార్ హీరోయిన్స్ కి సైతం గట్టిపోటీని ఇస్తోంది. 

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతోంది. ఇక రెమ్యునరేషన్ లో అయితే స్టార్ హీరోయిన్స్ కి సైతం గట్టిపోటీని ఇస్తోంది. గతంలో ఎప్పడు లేని విధంగా రమ్య కృష్ణ ఒక సినిమాకు 2కోట్ల వరకు ఆదాయాన్ని అందుకుంటోంది. 

జయలలిత బయోపిక్ కోసం 2 కోట్లకు పైగా పేమెంట్ అందుకుంటున్న శివగామి ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ రచయిత తమిళ్ వనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక డిఫరెంట్ సినిమాలో ఈ జోడి కనిపించనుంది.

దర్శకుడు SJ.సూర్య కూడా ఈ సినిమాలో నటించనున్నాడు. ఇక సినిమా కోసం రమ్యకృష్ణ పారితోషికం కోటి దాటినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన సూపర్ డీలక్స్ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. బాహుబలి సమయంలోనే తన క్రేజ్ ను అమితంగా పెంచుకున్న శివగామి ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో అస్సలు వెనకడుగు వేయడం లేదని టాక్.