Asianet News TeluguAsianet News Telugu

ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో రమ్యకృష్ణకి దక్కని గౌరవం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

కళాత్మక చిత్రాలు తెరకెక్కించే కృష్ణ వంశీ గత ఏడాది రంగమార్తాండ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు.

Ramya Krishnan gets bad experience in film fare awards dtr
Author
First Published Jul 19, 2024, 3:27 PM IST | Last Updated Jul 19, 2024, 3:27 PM IST

కళాత్మక చిత్రాలు తెరకెక్కించే కృష్ణ వంశీ గత ఏడాది రంగమార్తాండ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. శివాత్మిక, బలగం వేణు, అనసూయ, తనికెళ్ళ భరణి ఇతర పాత్రల్లో కనిపించారు. 

ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కృష్ణ వంశీ తన స్టైల్ లో భావోద్వేగాలు పండేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. విమర్శకుల ప్రశంసలు దక్కితే ఆ చిత్రానికి అవార్డులు కూడా తప్పకుండా వస్తాయి. ఇప్పుడు రంగమార్తాండ చిత్రం అదే నిరూపించింది. 

ఏకంగా మూడు విభాగాల్లో రంగమార్తాండ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ విభాగంలో ప్రకాష్ రాజ్ కి, బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (మేల్) విభాగంలో బ్రహ్మానందం కి.. బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ ( ఫిమేల్) విభాగంలో రమ్యకృష్ణ కి అవార్డులు దక్కాయి. 

Ramya Krishnan gets bad experience in film fare awards dtr

అయితే రమ్యకృష్ణకి ఇచ్చిన అవార్డు విషయంలో వివాదం నెలకొంది. రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్రతో పోల్చుకుంటే రమ్యకృష్ణ పాత్ర కూడా సమానంగా.. అంతే బలంగా ఉంటుంది. రమ్యకృష్ణ అద్భుతమైన నటన కనబరిచారు.  కానీ ఆమె పాత్రని కేవలం సపోర్టింగ్ రోల్ అన్నట్లుగా పరిమితం చేశారు. 

దీనితో నెటిజన్లు ఫిలిం ఫేర్ నిర్వాహకులని ట్రోల్ చేస్తున్నారు. రమ్యకృష్ణకి బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ (ఫిమేల్) విభాగంలో అవార్డు ఇచ్చి ఉంటే గౌరవప్రదంగా ఉండేది అని.. అందుకు ఆమె అర్హురాలు అని అంటున్నారు. ఫిలిం ఫేర్ నిర్వాహకులు చేసిన ఈ తప్పిదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios