'అరవింద సమేత'.. రోమాంచనాలు, హృదయ ప్రకంపనాలు!

First Published 30, May 2018, 6:17 PM IST
ramjogayya shastry penned a song for ntr film
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' అనే 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ ఉగ్రరూపం దాల్చిన ఎన్టీఆర్ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ''రాఘవ నన్ను వెంతాడుతున్నాడు.. ఈ సినిమా కోసం ఎమోషనల్ సాంగ్ రాస్తున్నాను. రోమాంచనాలు, హృదయ ప్రకంపనాలు, కన్నీటి జీరలు ఖచ్చితం'' అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రామజోగయ్యశాస్త్రి అలానే సిరివెన్నెల సీతారామశాస్త్రి కొన్ని పాటలను రాస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

loader