సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదానికి తెరతీశాడు. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్ సన్నీలియోనీతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురిని పోల్చిన వర్మ... ఇప్పుడు అదే సన్నీలియోనీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోలుస్తున్నాడు. ఈ ఇద్దరికీ జనాన్ని ఆకర్షించే శక్తి మెండుగా వున్నందున వీళ్లిద్దరూ కలిసి పార్టీ పెడితే జనం తెగ రెస్పాండ్ అవుతారన్నది వర్మ ఫీలింగ్. ఇది నిజమే అయినా వర్మ సెటైరికల్ పోస్ట్ పా పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సీరియస్ గా రెస్పాండ్ అవుతున్నారు.

 

పవన్ కల్యాణ్‌ అభిమానులకు, కేరళలో సన్నీలియోన్‌ను చూడటానికి వచ్చిన వారికి పోలిక పెడుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. మొన్న నందిపై ప్రశ్నించిన వర్మ, నిన్న ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురినే కామెంట్ చేశాడు. సన్నీలియోన్ ని అడ్డంపెట్టుకొని ఇవాంకా ఫిగర్ ని తనివితీరా చూడాలని వుందంటూ పోస్ట్ చేశాడు.

 

సన్నీని, ఇవాంకాని పోల్చిన వర్మ ఈ రోజు మరోసారి పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయడానికి కూడా సన్నీ పేరునే వాడాడు. సన్నీలియోనీ, జనసేన పార్టీ కలయిక సూపర్ హిట్ అవుతుందంటూ పేర్కొన్నారు. వరుసగా 4 ట్వీట్లతో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

సన్నీలియోన్‌కి పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ జనం వస్తున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని అర్థం అంటూ ఏవో పిచ్చి పిచ్చి తికమక లైన్స్ రాసి మళ్లీ తనక్కూడా ఆర్థంకాని భాషలో ఏదో చెప్పేందుకు ట్రై చేశాడు వర్మ.

 

వచ్చే ఎన్నికల్లో సన్నీలియోనీ, పవన్ కల్యాణ్ కలయిక తిరుగులేని రాజకీయ ఎత్తుగడ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకు వేరు వేరు ఎంటర్‌టైనింగ్ సుఖాలు ఇచ్చారు.

 

సన్నీలియోన్‌కి.. పవన్ కల్యాణ్‌కి మధ్య ఒకరికే హగ్ ఇచ్చే అవకాశం పీకే ఫ్యాన్స్ కు ఇస్తే ఎవరిని హగ్ చేసుకుంటారో అన్నది పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నా ప్రశ్న. జనసేన/జనసేవ పార్టీతో పవన్ కల్యాణ్/సన్నీలియోనీ కలయిక సూపర్ హిట్ అవుతుంది. వాళ్లిద్దరు జనాన్ని ఆకట్టుకునే శక్తి సామర్థ్యాలు వున్నవారంటూ కామెంట్ చేశాడు వర్మ."